తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ... గ్రేటర్ మోర్చా ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించింది. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌లోని ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం నుంచి కుమురం భీం విగ్రహం వరకు గ్రేటర్ బీజేవైఎం ఆధ్వర్యంలో మోర్చా నాయకులు కార్యకర్తలు భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించకపోవడం గల కారణాలను బహిర్గతం చేయాలని భాజపా జాతీయ కార్యదర్శి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.