రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని బీజేవైఎం నాయకులు ఆరోపించారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు.
బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం యువ మోర్చా నేతలు రహదారిపై బైఠాయించి కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నాతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
- ఇదీ చదవండి : అర్ధరాత్రి డ్రోన్ల కలకలం.. బలగాలు అప్రమత్తం