అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీని కావాలనే ముద్దాయి చేయాలని కొన్ని పార్టీలు చూస్తుండడం దురదృష్టకరమని ఏపీ భాజపా ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు అని వ్యాఖ్యానించారు. తెదేపా ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు చాలా స్పష్టంగా కేంద్రం సమాధానం చెప్పామని.. అదే విషయాన్ని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో కేంద్రం సమర్పించిందన్నారు. అమరావతి రైతుల పక్షాన భాజపా నిలబడుతుందన్నారు.
ఏపీ ప్రభుత్వం ఇంతవరకు రాయలసీమ ప్రాంతంలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకు కూడా టెండర్లు పిలవలేదన్నారు. రాయలసీమలో కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు అంశంలోనూ ఏపీ ప్రభుత్వం సరిగా స్పందించడం లేదన్నారు. ప్రజాక్షేత్రంలో బలమైన నేతలను భాజపా తప్పకుండా పార్టీలోకి ఆహ్వానిస్తుందని.. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి భాజపాలోకి వస్తానంటే స్వాగతిస్తామన్నారు.
ఇదీ చదవండి: సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్