ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు గవర్నర్‌కు ఈ మెయిల్లో లేఖ పంపించారు.
కరోనాను ఎదుర్కోవడంలో తెరాస సర్కారు విఫలమైందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడం వల్ల పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేకపోవడం వల్ల గత్యంతరం లేక పేద, మధ్య తరగతి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్‌లో కరోనా చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపిన బండి సంజయ్.. ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా కరోనా చికిత్స చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీలో భాగంగా చికిత్సలు చేయడం లేదన్నారు.
ఇవీచూడండి: ప్రభుత్వాల నిర్లక్ష్యమే కేసుల పెరుగుదలకు కారణం: ఉత్తమ్