జమ్ము కశ్మీర్ విభజనతో కాంగ్రెస్‌లోనూ విభజన మొదలైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఖేల్ ఖతం దుకాణ్ బంద్ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. 370 ఆర్టికల్‌తో కేవలం మూడు కుటుంబాలే రాజకీయంగా, ఆర్థికంగా లబ్ధిపొందినట్లు వివరించారు. జమ్ము కశ్మీర్ మాదిరిగానే మోదీ, అమిత్ షా తెలంగాణ విమోచనదినానికి పరిష్కార మార్గం చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఐదు వేల కోట్ల విలువైన భవనాలు సచివాలయంలో ఉన్నప్పుడు కూల్చి కొత్తవి కట్టడం ఏంటని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: వర్షాకాలం జాగ్రత్త సుమీ- ఇట్లు.. హైదరాబాద్ పోలీస్