నమామి మూసి ఉద్యమంలో భాగంగా భాజపా నేతలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. మూసీనది నగరంలోకి ప్రవేశించే బాపూఘాట్ వద్ద రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణ ఇతర నేతలు నదికి హారతినిచ్చారు. అక్కడి నుంచి ర్యాలీగా హుస్సేన్‌సాగర్‌కు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి ఆ నీటిలో సాగర్‌లో కలిపారు.
మూసీ నది, హుస్సేన్ సాగర్ల ప్రక్షాళన పేరుతో ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మభ్యపెట్టారని ఆరోపించారు. వీటిపై ప్రజలను చైతన్యవంతులను చేస్తామని లక్ష్మణ్ తెలిపారు.
ఇవీచూడండి: 'మూసీ సుందరీకరణ కాదు.. శుద్ధీకరణ జరగాలి'