ETV Bharat / city

కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది.. భాజపా పుంజుకుంటోంది! - హైదరాబాద్​ను యూటీ చేసే ఆలోచన లేదు

డిసెంబర్​ నాటికి అన్నిస్థాయిల్లో పార్టీ కమిటీల నియమకం పూర్తవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్​ గ్రాఫ్​ క్రమంగా పడిపోతోందని.. అదే సమయంలో మోదీ ఇమేజ్​ పెరుగుతోందన్నారు.

కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది.. భాజపా పుంజుకుంటోంది!
author img

By

Published : Nov 13, 2019, 3:54 PM IST

హైదరాబాద్​ను ఊటీ చేయాలనే ఆలోచన తమ పార్టీకి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తేల్చిచెప్పారు. ఇప్పటివరకు పార్టీలో అటువంటి ప్రస్తావన రాలేదన్నారు. రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెరిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 52 శాతం పోలింగ్​ బూత్​ కమిటీల నియామకం పూర్తయిందని లక్ష్మణ్​ వెల్లడించారు. డిసెంబర్​లో జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ కమిటీల నియామకాలు పూర్తవుతాయన్నారు. పార్టీ తనకు ఏబాధ్యత అప్పగించినా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

తెరాసకే అనుకూలం...

మున్సిపల్​ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని.. ఈసారి అన్ని వార్డుల్లోనూ పోటీచేస్తామని ప్రకటించారు. పురపాలక ఎన్నికలు అధికార పార్టీకే అనుకూలమన్న లక్ష్మణ్​.. జీహెచ్​ఎంసీ ఎన్నికలు తమకు సెమీఫైనల్​ అన్నారు. రాష్ట్రంలో క్రమంగా కేసీఆర్​ గ్రాఫ్​ తగ్గి.. మోదీ ఇమేజ్​ పెరుగుతోందన్నారు.

ఆర్టీసీపై ఐఓసీకి ఫిర్యాదు

ఆర్టీసీలో ప్రభుత్వ జోక్యం ఎక్కువయ్యే సంస్థ నష్టాల బాటపట్టిందని లక్ష్మణ్​ ఆరోపించారు. సంస్థ స్థలాల్లో పెట్రోల్​ బంకుల ఏర్పాటుపై ఐఓసీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. భాజపా ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదని.. దానివల్ల వ్యక్తులకు కాకుండా సంస్థకు లాభాలు రావాలన్నారు. కేసీఆర్​ రెండోసారి అధికారంలోకి వచ్చాక పథకాలన్నీ నత్తసడకన సాగుతున్నాయని విమర్శించారు. అప్పులు, విషజ్వరాలు, ఆత్మహత్యలు పెరిగిపోయాయని అన్నారు.

ప్రాంతీయ పార్టీలు సెంటిమెంట్​, ఎమోషన్స్​ అజెండాగా పనిచేయడం వల్లనే రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు స్పెస్​ లేకుండా పోతుందని లక్ష్మణ్​ అభిప్రాయపడ్డారు.

ఇవీచూడండి:

TG_Hyd_29_13_BJP_Laxman_Chit_Chat_AV_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) హైదరాబాద్‌ రెండవ రాజధాని విషయంలో పార్టీలో ప్రస్తావన రాలేదని... యూటీ చేయాలనే ఆలోచన లేనేలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ తేల్చిచెప్పారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే బాగుంటుందని అయన అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని చెప్పిన లక్ష్మణ్...ఈ సారి అన్ని వార్డుల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 52శాతం పోలింగ్ బూతు కమిటీలు పూర్తయ్యాయని డిసెంబర్‌లో రాష్ట్ర జాతీయ స్థాయి కమిటీలు పూర్తవుతాయని వెల్లడించారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో అయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మున్సిపల్ ప్రాంతాల్లో తప్పకుండా ప్రభావం చూపుతాయన్నారు. రైతుబంధు పథకంలో కేసీఆర్ ఇవ్వాల్సిన డబ్బులు రావడంలేదని...మోదీ ఇచ్చే డబ్బులు మాత్రమే వస్తున్నాయననే విషయం ప్రజల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. ఆర్టీసీలో ప్రభుత్వ జోక్యం ఎక్కువయ్యే నష్టాలకు దారి తీసిందని లక్ష్మణ్ ఆరోపించారు.ఆర్టీసీ స్థలాల్లో పెంట్రోల్‌ బంకుల ఏర్పాటుపై ఐఓసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. భాజపా ప్రయివేటైజేషన్‌కు వ్యతిరేకం కాదని... దాని వల్ల సంస్థకు లాభం జరుగాలని వ్యక్తులకు కాదని చెప్పారు. కేసీఆర్ మొదటి టర్మ్‌లో చేసిన పథకాలన్ని రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నత్తనడక సాగుతున్నాయని విమర్శించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ గ్రాఫ్ తగ్గిపోయి మోదీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. తెలంగాణలో పాలన స్తంభించిపోయిందని...ఆర్థిక పరమైన నిర్ణయాలు జరగడంలేదని ఆరోపించారు. కేసీఆర్ రెండవసారి గెలిచాక అప్పులు, విషజ్వరాలు,ఆత్మహత్యలు సాధించారని దుయ్యబట్టారు. కేసీఆర్‌పై రాజకీయ పోరాటం కొనసాగుతోందని సమయం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని దోషిఆ చూపిస్తున్నామని పేర్కొన్నారు. తప్పులపై తప్పులు చేస్తామంటే శిక్ష తప్పదని లక్ష్మణ్‌ హెచ్చరించారు. పార్టీ తనకు ఏ బాధ్యత ఇచ్చినా దానిని చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయని... జీహెచ్‌ఎంసీ ఎన్నికలు తమకు సెమిఫైనల్‌గా స్పష్టం చేశారు. ప్రజలు మోదీని కారణజన్ముడిగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎదో ఒక సెంట్‌్మెంట్‌, ఎమోషన్స్‌ ఏజెండగా పనిచేయడం వల్ల రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు స్పెస్ లేకుండా పోతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.