రాష్ట్ర ప్రజలందరికీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి అనుగ్రహంతో ప్రజలంతా సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు.
చెడు ఎంత దుర్మార్గమైనదైనా.. ఎంత శక్తిమంతమైనదైనా.. అంతిమంగా విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు. మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందని గుర్తుచేశారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.
ఇవీచూడండి: దేశ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని దసరా శుభాకాంక్షలు