ETV Bharat / city

ఐదేళ్లలో భాగ్యనగరానికి తెరాస చేసిందేమీ లేదు: బండి

author img

By

Published : Nov 9, 2020, 7:02 PM IST

ట్రాఫిక్ సమస్య నివారణకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్​ మెట్రోలో ప్రయాణించటం సంతోషంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మియాపూర్​ నుంచి నాంపల్లి వరకు ప్రయాణించిన సంజయ్​తో ఫొటోలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపారు.

bjp state president bandi sanjay travel in hyderabad metro from miyapur to nampally
ఐదేళ్లలో భాగ్యనగరానికి తెరాస చేసిందేమీ లేదు: బండి

అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తున్న జీహెచ్​ఎంసీని తెరాస ప్రభుత్వం పాతబస్తీ తరహాలో... వెనక్కి తీసుకెళ్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సంగారెడ్డిలో భాజపా నాయకులతో సమావేశం అనంతరం... పటాన్​చెరు నుంచి మియాపూర్​కు చేరుకున్నారు. మియాపూర్​ నుంచి నాంపల్లికి మెట్రో రైలులో ప్రయాణించారు. ట్రాఫిక్ సమస్య నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించటం సంతోషంగా ఉందన్నారు.

రానున్న జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాజపా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లలో తెరాస ప్రభుత్వం హైదరాబాద్​కు చేసిందేమీ లేదని విమర్శించారు. మెట్రోలో సంజయ్​తో ఫొటోలు దిగేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపారు. గాంధీ భవన్​ మెట్రో స్టేషన్​లో దిగిన సంజయ్​... పార్టీ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్లారు.

ఇదీ చూడండి: 'మీరు రాజీనామా చేస్తామంటే కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.