ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎంతో చెట్టాపట్టాలేసుకుని ముందుకెళ్లడం సమంజసం కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఎంఐఎం అనుచిత వ్యాఖ్యలు చేసినా... ఖండించని పార్టీ తెరాస అంటూ అంటూ మండిపడ్డారు. సీఎం వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు.
బీసీల స్థానంలో ముస్లింలను గెలిపించేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. శివసేన రాష్ట్ర అధ్యక్షడు మురారీ భాజపాలో బండి సంజయ్ సమక్షంలో చేరారు. కాంగ్రెస్‌తో శివసేన కలవడం తనకు మనస్తాపం కలిగించిందని మురారీ తెలిపారు. రాష్ట్రంలో తెరాసతోపాటు మజ్లిస్‌ను భూస్థాపితం చేస్తామన్నారు.
ఇదీ చూడండి: భాజపాలో 'సింధియా' ఒంటరి పోరు- ఎందుకు?