హైదరాబాద్ తార్నాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లను పాటించాలని భాజపా స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు వెంకటేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఇఫ్లూ యూనివర్సిటీలో చేపట్టిన టీచింగ్ పోసుల భర్తీలో ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇఫ్లూ వైస్ ఛాన్స్లర్ ఏవిధమైన రిజర్వేషన్లను పాటించకుండా ఏకపక్షంగా నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఆయన ఖడించారు.
ఇప్పుడు జరుపుతున్న ఇంటర్వ్యూలను వెంటనే ఆపేయాలని కోరారు. కొత్త వీసీ వచ్చేవరకు ఈ నియామకాలను ఆపేయాలని కోరారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.