దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా గెలుపుపై ఆ పార్టీ సీనియర్ నేత రాంమాధవ్ స్పందించారు. తెలంగాణలో భాజపా గొప్ప విజయం సాధించిందని, అప్రజాస్వామిక తెరాస పాలనలోనూ ప్రజలు రఘునందన్‌రావును గెలిపించారని ట్వీట్ చేశారు. తెరాస కుటుంబ రాజకీయాలకు ప్రత్యామ్నాయ శక్తిగా భాజపా ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర శాఖకు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి: విలేకరి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన రఘునందన్ రావు