మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లో భాజపా సంకల్ప యాత్ర చేపట్టింది. కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామచందర్ రావు, భాజపా నాయకులు పేరాల శేఖర్ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నాగోల్ డివిజన్ పరిధిలోని కాలనీలలో సంకల్ప యాత్ర చేపట్టారు. గాంధీజీ కలలుగన్న సుస్థిర పాలన కేవలం భాజపాతోనే సాధ్యమని... అందుకు అనుగుణంగా మోదీ పరిపాలన కొనసాగుతోందని వారు అన్నారు. అంటరానితనం, అవినీతిని రూపుమాపి అహింస, స్వచ్ఛమైన పాలనను అందించడం కోసం భాజపా పాటు పడుతోందని వారు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి : లైకుల కోసం తుపాకీ.. పోలీసుల అదుపులో యువకులు