ETV Bharat / city

అల్వాల్​లో భాజపా ధర్నా.. నాయకుల అరెస్టు - BJP Leaders Arrest

సికింద్రాబాద్​ పరిధిలోని అల్వాల్​ చౌరస్తాలో భాజపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీహెచ్​ఎంసీ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ భాజపా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

BJP Protest in Alwal Against ghmc Act amendment
అల్వాల్​లో భాజపా ధర్నా.. నాయకుల అరెస్టు
author img

By

Published : Oct 13, 2020, 2:26 PM IST

జీహెచ్​ఎంసీ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ భాజపా ఆధ్వర్యంలో అల్వాల్​ చౌరస్తాలో టీం సాయిబృందం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భాజపా ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపు మేరకు.. పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసనకు దిగిన భాజపా నాయకులను అరెస్ట్ చేసి.. బొల్లారం పీఎస్​కు తరలించారు.

అల్వాల్​లో భాజపా ధర్నా.. నాయకుల అరెస్టు

తెలంగాణ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని.. ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి.. కేసులు పెడుతున్నదని భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్​ స్టేషన్లన్ని.. తెరాస కార్యాలయాలుగా మారాయని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ నియతృత్వ ధోరణికి జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.