JP Nadda On TRS: తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని.. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కేసీఆర్ పాలన ఉందని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా... అన్న అనుమానం వస్తోందన్నారు. తెలంగాణలో భాజపా ధర్మ యుద్ధం చేస్తోందన్న నడ్డా.. ధర్మ యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. జాతీయ పార్టీగా కేసీఆర్ ముసుగు తొలగిస్తామన్నారు. దేశంలో అత్యంత అవినీతి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఆరోపించారు.
మద్దతు ఇవ్వడానికే వచ్చా..
ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇవ్వడానికే వచ్చానని జేపీ నడ్డా చెప్పారు. జీవో 317 ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఉద్యోగులు, ప్రజల తరఫున పోరాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. శాంతియుత పద్ధతుల్లో ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు.
భాజపా కార్యాలయంలోకి బలవంతంగా చొచ్చుకెళ్లారు..
రెండ్రోజులుగా జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్య హత్యేనని నడ్డా ఆగ్రహించారు. భాజపా కార్యాలయంలో శాంతియుతంగా ధర్నా చేయాలని సంజయ్ నిర్ణయం తీసుకున్నారని.. అయినా బలవంతంగా కార్యాలయంలోకి బలవంతంగా చొచ్చుకెళ్లి.. సంజయ్‌పై పోలీసులు చేయిచేసుకున్నారని ఆరోపించారు. భాజపా కార్యకర్తలపైనా పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆగ్రహించారు.
బండి సంజయ్‌ను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్న నడ్డా.. సంజయ్ అరెస్టుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నివేదిస్తామన్నారు. అరెస్టుపై అన్ని వేదికలపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. సంజయ్ అరెస్టుపై స్పీకర్ రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటారని జీపీ నడ్డా వెల్లడించారు. భాజపా పోరాటం ప్రజాస్వామ్య పద్ధతిలో అంతిమ నిర్ణయం వచ్చే వరకు సాగుతుందని చెప్పారు. భాజపా సైద్ధాంతిక పార్టీ అని.. వ్యక్తుల ఆధారంగా పనిచేయదని స్పష్టం చేశారు.
'దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటమి తర్వాత.. కేసీఆర్ మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. రాచరికపాలన ఇక్కడ నడుస్తోంది. కుటుంబపాలనలో నడిచే అవినీతి ప్రభుత్వాన్ని.. ప్రజాస్వామ్యపరంగా సాగనంపే వరకు మా పోరాటం కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎం మాదిరి వాడుకున్నారు. పాలమూరు, రంగారెడ్డి ఒక్క నీటిచుక్క ఇవ్వలేదు. ధర్నాచౌక్ వద్ద ధర్నాలు వద్దన్న తెరాస నేతలే ధర్నాచౌక్‌లో నిరసన తెలిపారు. హుజూరాబాద్ రుచిని రాష్ట్రమంతా తెరాసకు చూపిస్తాం.'
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
ఇవీచూడండి:
- JP Nadda : గాంధీ విగ్రహానికి జేపీ నడ్డా నివాళులు
- JP Nadda Hyderabad Tour: శాంతియుతంగా ర్యాలీ జరిగి తీరుతుంది: జేపీ నడ్డా
- Bandi Sanjay: బండి సంజయ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
- BJP Protest in Telangana: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు భాజపా నిరసనలు..
- Kishan Reddy on Bandi Sanjay Arrest : 'ధర్నాచౌక్ కేసీఆర్ కోసమేనా.. ప్రతిపక్షాలు ఆందోళన చేయకూడదా?'
- Laxman Fire on TRS: 'బండి సంజయ్ ఘటన అమిత్‌షా దృష్టికి తీసుకెళతాం'
- BJP Leaders on Bandi Sanjay Arrest: అంతా మీ ఇష్టమేనా... మీకు కొవిడ్ నిబంధనలు వర్తించవా?