కొన్నేళ్లుగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని భాజపా జాతీయ నాయకుడు లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల మధ్య అధికార పార్టీ చిచ్చుపెడుతోందని ఆరోపించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా.. భాజపా అభ్యర్థి రాంచందర్ రావుతో కలిసి ఇందిరా పార్కులో ప్రచారం నిర్వహించారు. ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి వ్యాయామం చేశారు. పట్టభద్రుల, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి భాజపా అభ్యర్థి రాంచందర్ రావుకు ఓటు వేసి గెలిపించాలని లక్ష్మణ్ కోరారు.
- ఇదీ చూడండి : ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కోచ్ ఫ్యాక్టరీ రగడ