వైద్యుల నిర్లక్ష్యం వల్లనే గాంధీ ఆస్పత్రిలో కరోనాతో చేరిన ఏడు నెలల గర్భిణి మరణించిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. సరైన వైద్యం అందించడం లేదంటూ బాధిత కుటుంబ సభ్యులు తనతో చెప్పారన్నారు. ఇదే విషయమై.. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్‌కు ఫోన్ చేసినా ఫలితం లేదన్నారు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడినా సరిగా స్పందించలేదన్నారు. మొదట్లో కరోనా రోగులను పట్టించుకున్న ప్రభుత్వం, వైద్యులు.. ఇప్పుడెందుకు అశ్రద్ధ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హర్ష మృతికి ఎవరు బాధ్యత వహిస్తారో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: గాంధీ ఆసుపత్రిలో కరోనాతో నిండు గర్భిణి మృతి