ETV Bharat / city

TRS vs BJP: 'భాజపా ఎదురుతిరిగితే మూడే గంటల్లో తెరాస భూస్థాపితం ఐతది' - bandi sanjay latest news

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెరాస కార్యకర్తలు చేసిన దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల వైఫల్యాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

bjp leaders responded on trs attack on bandi sanjay

author img

By

Published : Nov 16, 2021, 4:36 AM IST

ఉమ్మడి నల్గోండ పర్యటనలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తెరాస కార్యకర్తలు చేసిన దాడిని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. దాడులు జరుగుతున్న ప్రేక్షక పాత్ర పోషించారంటూ.. పోలీసుల వైఫల్యాన్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు.

ఓడిపోతున్నామనే భయంతోనే..

కేంద్ర ప్రభుత్వం నిధులతో వరి కొనుగోలు ఎలా జరుగుతోందని పరిశీలించేందుకు వెళ్లిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి ఆర్వింద్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

"ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సందర్శనకు వెళ్తే తెరాస కార్యకర్తలు దాడులు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే భాజపా నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. అప్పట్లో వరంగల్​లో నాపైన కూడా ఇలాంటి దాడి జరిగింది. భాజపా కార్యకర్తలు.. ఇలా రెండు సార్లు మూడు సార్లు మాత్రమే చూస్తుంది. ఒక్కసారి.. ఓపిక నశించి ఎదురు తిరిగితే.. మూడే గంటల్లో తెరాస పార్టీ కనుమరుగైపోతుంది. ఏదైనా ఉంటే.. రాజకీయంగా ఎదుర్కొవాలి. ఇలా భౌతికంగా దాడులు చేస్తే.. ఎక్కడ దోషులుగా నిలబెట్టాలో అక్కడ నిలబెడతాం." - ధర్మపురి అర్వింద్​, ఎంపీ

కేసీఆర్​ కనుసన్నల్లోనే దాడులు..

మరోవైపు.. కేసీఆర్ సర్కారు తీరుపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. శాంతి భద్రతలను కాపాడటంలో కేసీఆర్ సర్కారు విఫలం అయ్యిందని దుయ్యబట్టారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహన శ్రేణిపై తెరాస గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడులు పూర్తిగా సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు. రైతులకు చేసిన మోసాలకు కేసీఆర్ సర్కారు తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గరపడిందన్నారు.

"శాంతిభద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం. బండి సంజయ్ వాహనశ్రేణిపై దాడిని ఖండిస్తున్నా. దాడులన్నీ కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. రైతులకు తెరాస మోసం పూర్తిగా అర్థమైంది. రైతులకు చేసిన మోసాలకు మూల్యం చెల్లించుకుంటారు. రైతుల దగ్గరికి భాజపా నాయకులు వెళ్తే.. కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోంది. రైతులకు తెరాస చేసిన మోసం, దగా పూర్తిగా అర్థం అయ్యింది. తెరాస వైఫల్యాలపై రైతులు, ప్రజలు, భాజపా కార్యకర్తలు తిరగబడే రోజు ఆసన్నమైంది. కేసీఆర్​కు భయపడి పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు." - రఘునందన్​రావు, దుబ్బాక ఎమ్మెల్యే

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.