ETV Bharat / city

పారిశుద్ధ్య కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష: భాజపా

author img

By

Published : Oct 8, 2020, 11:06 AM IST

ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్బంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయాలని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఎల్బీ నగర్​ నియోజకవర్గంలోని హయత్​ నగర్​, మన్సూరాబాద్​ డివిజన్లకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు భాజపా నాయకులు సన్మానం చేశారు. వారు కష్టపడి పనిచేస్తేనే.. వీధులు, దేశం పరిశుభ్రంగా ఉంటాయని.. పారిశుద్ధ్య కార్మికులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని భాజపా నేతలు అన్నారు.

BJP Leaders Felicitation to GHMC Workers On the occasion Of Modi Birth Day
మోదీ జన్మదినం సందర్భంగా.. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

భారత ప్రధాని మోదీ 70వ జన్మదిన వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ ఎల్బీ నగర్​లో భాజపా నాయకులు కార్మికులకు సన్మానం చేశారు. హయత్​ నగర్​, మన్సూరాబాద్​ డివిజన్లలో విధులు నిర్వహించే దాదాపు 300 మంది పారిశుద్ధ్య కార్మికులకు భాజపా నాయకులు కళ్లెం జీవన్​ రెడ్డి, రవీందర్​ రెడ్డిల ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన.. భాజపా ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా.. జాతీయ నాయకులు పేరాల శేఖర్​ మున్సిపల్​ సిబ్బందికి కొత్త బట్టలు పెట్టి.. సన్మానించారు.

రాత్రి, పగలు తేడా లేకుండా పారిశుద్ధ్య కార్మికులు చెమటోడ్చి రోడ్లు, కాలనీలు శుభ్రం చేస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్య ధోరణి వహిస్తుందని ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికులకు నెలకు రూ.30 వేలు జీతం ఇవ్వాలని.. టీఏ, డీఏ కల్పించాలని.. ప్రతీ పారిశుద్ధ్య కార్మికునికి రెండు పడకల ఇల్లు కేటాయించాలని డిమాండ్​ చేశారు. భారతీయ జనతా పార్టీ పేదల పక్షాల పోరాడుతుందని.. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం రాగానే.. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు రూ.30 వేలకు పెంచుతామని అన్నారు. భాజపా పేదల పక్షాన నిలబడే పార్టీ అని.. రాబోయే గ్రేటర్​ ఎన్నికల్లో భాజపాకు ఓట్లేసి.. అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా నాయకులు సామ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.