ETV Bharat / city

'దేవాలయాల్లో కూడా రాజకీయాలు చేస్తున్నారు'

హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవారి దేవాలయం ముందు వీహెచ్​, భాజపా నాయకులు నిరసన తెలిపారు. ధర్నాలో పాల్గొన్న భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్... కేసీఆర్ చేస్తున్న నీచమైన రాజకీయాలు మానుకోవాలని లక్ష్మణ్ హెచ్చరించారు.

bjp leader laxman fire on cm kcr
bjp leader laxman fire on cm kcr
author img

By

Published : Nov 25, 2020, 3:40 PM IST

తెరాస నాయకులు దేవాలయాల్లో కూడా రాజకీయాలు చేస్తున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ విమర్శించారు. దేవాలయాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం వద్దంటూ... హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవారి దేవాలయం ముందు వీహెచ్​పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజుతో కలిసి నిరసన తెలిపారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మవారి దేవాలయాన్ని ఎండోమెంట్ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.

శృంగేరి పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న... పాలక మండలి కమిటీను రద్దు చేసి... తెరాస పార్టీ నాయకులను కమిటీలో తీసుకునే కుట్ర చేస్తున్నారని లక్ష్మణ్​ ఆరోపించారు. తాను గొప్ప హిందువుగా చెప్పుకొనే ముఖ్యమంత్రి కేసీఆర్... హిందు దేవాలయాల అభివృద్ధిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నామని ఇష్టనుసారంగా వ్యవహరిస్తూ... కేసీఆర్ చేస్తున్న నీచమైన రాజకీయాలు మానుకోవాలని లక్ష్మణ్ హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'రాష్ట్ర పథకాల్లో అధికశాతం కేంద్రం భాగస్వామ్యంతోనే అమలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.