జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పటికీ... ప్రజలను మళ్లీ మోసం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఫాంహౌజ్‌లో సేదతీరుతూ.. అబద్ధాలతో రాజ్యమేలుతున్నాడని మండిపడ్డారు. కోట్లు ఖర్చు పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడని ఆరోపించారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో భాజపా కార్పొరేటర్లతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తూ.. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని కార్పొరేటర్లకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు.