దేశవ్యాప్తంగా సమగ్ర విద్యుత్ విధానం రావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త నాటకాలకు తెరతీశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు, విద్యుత్ సంస్కరణలు చేపట్టడం వల్లే 28 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉందన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని లక్ష్మణ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే విద్యుత్ కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రే అవినీతి పెరిగిపోయిందనడం సంతోషకరమన్నారు. లక్ష్మణ్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్‌గౌడ్, విజయపాల్‌రెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్ నామాగౌడ్‌తో పాటు పలువురు భాజపాలో చేరారు.
ఇవీ చూడండి: తెలంగాణలో భాజపా సభ్యత్వాలు 12లక్షలే: కేటీఆర్