రైతులు పండించిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటుందని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణలో మాత్రం చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి, భాజాపా నేత విజయ రామారావు. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని బీరాలు పలికిన ముఖ్యమంత్రి ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి చూపించలేదని భాజాపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన విమర్శించారు. భాజాపా నేతలు రైతుల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్తే మంత్రులు ఎదురు దాడికి దిగుతున్నారని ఆరోపించారు.
కరోనా నియంత్రణలో ప్రధాని మోదీ కృషి అభినందనీయమని ముఖ్యమంత్రి కేసీఆర్ కీర్తిస్తుంటే... ఆయన తనయుడు కేటీఆర్ సహా ఇతర మంత్రులంతా ఇదంతా తెరాస వల్ల మాత్రమే సాధ్యమయిందంటూ.. రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్ర ప్రభుత్వానిది అని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు