హైదరాబాద్‌లో అక్రమంగా గుర్తింపుకార్డులు పొందిన రోహింగ్యాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. 127 మంది రోహింగ్యాలు అక్రమంగా ఆధార్‌తో పాటు ఇతర గుర్తింపుకార్డులు పొందారని లక్ష్మణ్ తెలిపారు. ఈ జాబితాను డీజీపీ మహేందర్ రెడ్డికి అందించారు.
రోహింగ్యాలపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న పోలీసులకే... అసదుద్దీన్ ఓవైసీ సవాల్ విసురుతున్నాడని... ప్రభుత్వం అండ చూసుకొనే ఓవైసీ సోదరులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు.
దేశహితం కోసం ప్రధాని మోదీ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తే... మతం రంగు పులిమి రాజకీయం చేస్తున్న వాళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: తెరవడం తెలియక వదిలేశారు.