కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని నటుడు సోహెల్ కోరారు. ఓ టెలివిజన్ రియాల్టీ షోలో గెలుచుకున్న నగదు బహుమతిలో రూ.10 లక్షలను పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చి సోహెల్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఆయా సంస్థలకు చెక్కులను అందించారు.
చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథశ్రమం, నేరేడ్మెట్లోని మదర్ నెస్ట్, రామగుండంలోని తబితా స్వచ్ఛంద సేవా సంస్థ, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని పీపుల్స్ స్వచ్ఛంద సంస్థకు చెక్కులు పంపిణీ చేశారు. పెద్దపల్లిలోని తన బంధువులలో ముగ్గురు దివ్యాంగ యువతులకు ఆర్థిక సహాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తానని సోహెల్ తెలిపారు.
ఇదీ చూడండి: అఖిలప్రియను కస్టడీలోకి తీసుకున్న బోయిన్పల్లి పోలీసులు