వినూత్న రీతిలో ఫింగర్ రింగ్స్...
యువతుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకునే డిజైనర్లు సైతం ప్రత్యేకంగా ఉంగరాల తయారీపై దృష్టి సారిస్తున్నారు. లీఫ్ డిజైన్, నెమలి, పులి, సింహం, పాండా, వాచ్ స్టైళ్లలో ఉంగరాలను తయారుచేస్తున్నారు. క్లస్టర్, కాక్ టెయిల్, నగ్గెట్, వింటేజ్ రింగ్స్ ఇప్పుడు నవతరం ఫ్యాషన్లో భాగమైపోయాయి. మరీ ముఖ్యంగా వేలుమొత్తం కవర్ అయ్యేలా ఉండే ఫుల్ ఫింగర్, హేవీ సైజ్లో ఉండే స్టోన్ రింగ్స్కి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
మీరు లుక్కేయండి...
మీకూ సరికొత్త ఫ్యాషన్ల పట్ల ఆసక్తి ఉంటే ఓ సారి ఈ భారీ ఉంగరాలవైపు లుక్కేయండి. బంగారం, వెండిని తలదన్నేలా... వివిధ రకాల స్టోన్లతో అందంగా తీర్చిదిద్దిన భారీ ఉంగరాలు.. నచ్చిన సైజ్ లో మెచ్చె డిజైన్లతో మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.