అఫ్ఘనిస్థాన్ క్రికెటర్‌తో జరగాల్సిన పెళ్లిని బిగ్ బాస్ బ్యూటీ అర్షి ఖాన్ రద్దు చేసుకుంది. ప్రస్తుతం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాజాగా ఆమె సంచలన నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.
దేశం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లి పోవడంతో ప్రజలు ఆ దేశాన్ని విడిచి పారిపోయేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుత ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్షి ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి అరాచకాలు చూసి తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందినట్లు ఆమె తెలిపింది. బిగ్ బాస్ సీజన్ -11 లో పాల్గొన్న ఆమె.. తరువాత జరిగిన 14వ సీజన్‌లో ఛాలెంజర్‌గా షోలో తిరిగి ఎంట్రీ ఇచ్చింది.