పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస అక్రమాలకు పాల్పడిందని భాజపా నేత రాంచందర్‌రావు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక గోయల్‌కు ఫిర్యాదుచేశారు. ఈ విషయంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు. దొంగ ఓట్లు వేయించి, భారీ ఎత్తున డబ్బు పంచారు. నిబంధనలకు వ్యతిరేకంగా పట్టభద్ర ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. నగదు చెల్లింపుల యాప్‌ల ద్వారా ఒక్కొక్క ఓటరుకు రెండు వేల నుంచి అయిదు వేల వరకు డబ్బు పంపిణీ చేశారు. పట్టభద్రుల ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు. వీటిపై సీబీఐ దర్యాప్తు కోరాం.
- రాంచందర్‌రావు, భాజపా నేత
ఇవీచూడండి: ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్.. ఏప్రిల్ 1 నుంచి అమలు