ETV Bharat / city

కిడ్నాప్​ కేసు: ముందస్తు బెయిల్‌ కోసం భార్గవరామ్‌ పిటిషన్‌ - akhila priya case latest updates

bhargav ram petition for advance bail in kidnap case

author img

By

Published : Jan 18, 2021, 4:21 PM IST

Updated : Jan 18, 2021, 5:22 PM IST

16:18 January 18

ముందస్తు బెయిల్‌ కోసం భార్గవరామ్‌ పిటిషన్‌

ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో నిందితుడిగా ఉన్న భార్గవరామ్... ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. కేసులో ఏ-3 నిందితునిగా ఉన్న తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సికింద్రాబాద్ న్యాయస్థానాన్ని కోరాడు. ఈ అపహరణ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పిటిషన్​లో పేర్కొన్నాడు. 

అఖిలప్రియను కూడా ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని... ఏ-1 గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2 గా మార్చి కేవలం నోటీసులు ఇచ్చి పంపారని పిటిషన్​లో పేర్కొన్నారు. వ్యాపారరీత్యా హైదరాబాద్​లో స్థిరపడ్డానని... పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి సహకరిస్తానని తెలిపారు. దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం ఉండదని.. భార్గవ్ పిటిషన్​లో తెలిపాడు. భార్గవరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్​పై బోయిన్​పల్లి పోలీసులకు నోటీసులు జారీ చేసిన సికింద్రాబాద్​ న్యాయస్థానం.. ఈ నెల 21వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

ఇదీ చూడండి: భార్గవరామ్ ఇంట్లో పథకం... 20 మంది 'గ్యాంగ్​'తో అమలు

Last Updated : Jan 18, 2021, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.