Drug Cases in Hyderabad : దినదినాభివృద్ధి చెందుతున్న భాగ్యనగరానికి మాదకద్రవ్యాల చెద పట్టుకుంది. ఇది వేగంగా నగరంలో విస్తరిస్తోంది. పోలీసులు ఎన్ని తనిఖీలు చేసి నిందితులను రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నా సరే.. హైదరాబాద్‌లోకి డ్రగ్స్‌ను పెడ్లర్లు, ఎడిక్టర్లు అక్రమమార్గాల్లో చేరవేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల నిఘా మరింత పెంచారు. డ్రగ్స్ వాడేవారికి, సరఫరా చేసేవారికి టీజీన్యాబ్ పోలీసులు ఓ హెచ్చరికను పంపారు. ఆనందంగా గడపాల్సిన వేడుకల్లో మాదకద్రవ్యాలకు చోటిస్తే జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని చెప్పారు.
ఇకనుంచి రిసార్ట్లు, పబ్‌లు, ఫామ్హౌస్లల్లో నిర్వహించే పార్టీల్లో అకస్మిక తనిఖీలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో గతంలో డ్రగ్స్ చేరవేస్తూ అరెస్టయిన వారిపై నిఘాను పోలీసులు ఉంచారు. జైలుకెళ్లొచ్చినా పద్ధతి మార్చుకోకుండా దందా సాగిస్తున్న కొందరిని టీజీ న్యాబ్ పోలీసులు మందలించినట్లు సమాచారం. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు తప్పటడుగు వేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొందరు డైరెక్టర్లు, వార్డెన్లను టీజీన్యాబ్ పోలీసులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
నగరానికి ముందుగానే సరకు : మూడు రోజుల వ్యవధిలోనే మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న నాలుగు ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. ఏటా అధికశాతం మత్తుపదార్థాలు నయాసాల్ వేడుకలే లక్ష్యంగా సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో 20 రోజుల ముందు నుంచే సరకు చేరవేస్తున్నారని తెలిపారు. న్యూఇయర్ సంబరాలు లక్ష్యంగా నైజీరియన్లు, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలోకి చేరుతున్నాయనే సమాచారం టీజీన్యాబ్ దృష్టికి ప్రత్యేకంగా వచ్చింది. దీంతో బెంగళూరు, గోవా, ముంబయి, ఏపీ, ఒడిశా నుంచి సరకు నగరానికి చేరే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
సమన్వయంతో మత్తుకు కళ్లెం : రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడిలో కఠినంగా వ్యవహరిస్తున్నామని టీజీన్యాబ్ ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. ఏపీ, గోవా, బెంగళూరు పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అనుమానం వస్తే వైద్య పరీక్షలు చేపడతామని టీజీన్యాబ్ ఎస్పీ వెల్లడించారు.
నిర్వాహకులతో సమావేశం : న్యూఇయర్ వేడుకలు మత్తు రహితంగా నిర్వహించుకోవాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. పోలీసులు పార్టీలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కానీ సంతోషంగా గడపాల్సిన చోట అనైతిక కార్యకలాపాలు ఉండకూదనేదని లక్ష్యంగా ఉందన్నారు. పబ్‌లు, ఫామ్‌హౌస్‌ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నామని రాచకొండ సీపీ తెలిపారు.
ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే - డైరెక్టుగా డోర్ డెలివరీ! - హైదరాబాద్‌లో పెరుగుతోన్న డ్రగ్స్ కల్చర్