LIVE : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం - TELANGANA ASSEMBLY SESSIONS
🎬 Watch Now: Feature Video
Published : Dec 17, 2024, 3:01 PM IST
|Updated : Dec 17, 2024, 3:51 PM IST
Assembly Sessions Live : తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు ఇవాళ మూడో రోజు కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఉభయ సభలు ప్రారంభమైయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు రెండు సభల్లోనూ సమాధానాలు ఇచ్చారు. ఆ తరువాత సోమవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ- బీఏసీ నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సమయంలో విపక్షాలకు సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. సభలో కీలకమైన చర్చలు జరిగేటప్పుడు బీఆర్ఎస్ నాయకులు భంగం కలిగిస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. సభా నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకోడానికి ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారి లోపాలు చూపడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి ప్రత్యక్షప్రసారం.
Last Updated : Dec 17, 2024, 3:51 PM IST