ETV Bharat / city

భారత్​-చైనా వివాదం: ఈటీవీ భారత్​ ముఖ్య కథనాలు

భారత్​-చైనా మధ్య వరసగా మూడు రోజులు చర్చలు జరిపారు. చర్చలతోనే ఇరు దేశాల సైనిక బలగాలను ఉపసంహరించడం, శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఏం చర్చించారు? ఇరు దేశాల మధ్య జోక్యంపై అమెరికా ఏమన్నది? అంతర్జాతీయ మీడియా వైఖరేంటి?... వంటి విషయాలపై ఈటీవీ భారత్​ కథనాలు.

bharat-china top stories in etv bharat
భారత్​-చైనా వివాదం: ఈటీవీ భారత్​ ముఖ్య కథనాలు
author img

By

Published : Jun 18, 2020, 9:07 PM IST

Updated : Jun 18, 2020, 9:17 PM IST

చైనాతో భారత్​ చర్చలు

భారత్- చైనా.. వరుసగా మూడో రోజు మేజర్ జనరల్స్ స్థాయి చర్చలు జరిపాయి. తూర్పు లద్దాక్​ గాల్వన్ లోయ నుంచి ఇరుదేశాల సైనిక బలగాలను ఉపసంహరించడం, సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం పునరుద్ధరించడం కోసం ఏం చేశారు..?

గల్వాన్​ నదిపై ఆనకట్టా.. మాకు తెలియదే: చైనా

తూర్పు లద్దాక్​లో గాల్వన్​ నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ చైనా అక్రమంగా నిర్మిస్తున్న ఆనకట్ట గురించి తనకేమీ తెలియదని ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ బుకాయించారు. భారత్​-చైనా సైనికుల మధ్య ఘర్షణలో... తప్పంతా భారత్​దేనట!

చైనా వ్యూహమేంటి? గల్వాన్​ ఘటనతో లక్ష్యం నెరవేరిందా?

20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న చైనాపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గల్వాన్​ లోయను చేజిక్కించుకోవడానికి చైనాకు ఇదే సరైన సమయమా? పక్కా ప్రణాళికతోనే లోయలో చైనా హింసకు పాల్పడిందా? భారత్​ను ఏకాకి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న చైనాకు గల్వాన్ లోయ ఎందుకంత ముఖ్యం?

'జవాన్ల వద్ద ఆయుధాలుంటాయి.. కానీ వినియోగించరు'

లద్దాక్ సరిహద్దులో సైనికులను నిరాయుధులుగా ఎందుకు పంపారన్న రాహుల్​ ప్రశ్నకు బదులిచ్చారు విదేశీ వ్వవహారాల మంత్రి ఎస్​ జయ్​శంకర్. జవాన్ల వద్ద ఎప్పుడూ ఆయుధాలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే భారత్​- చైనా మధ్య 1996, 2005లో కుదిరిన ఒప్పందాల ప్రకారం ఇరు దేశాల సైనికులు ఘర్షణ పడినప్పుడు వాటిని ఉపయోగించడానికి వీల్లేదని ట్విట్టర్​లో వివరించారు.

చైనా కంపెనీతో రైల్వే కాంట్రాక్ట్ రద్దు!

ఓ చైనా కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్​ను రద్దు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. కాన్పుర్- మొగల్​ సరాయి మధ్య నిర్మిస్తున్న రైల్వే లైనులో.. సిగ్నలింగ్, టెలికమ్యునికేషన్​ పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం చేస్తుండడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

డ్రాగన్​పై రామబాణం- చైనాకు వ్యతిరేకంగా ట్వీట్ల వర్షం

లద్దాక్​లో ఘర్షణ అనంతరం భారత్​- చైనా మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇలాంటి సమయంలో భారత్​కు మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు తైవాన్​, హాంకాంగ్​కు చెందిన నెటిజన్లు. వారు చేసిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్​గా మారాయి.

'జాతీయవాద పులిని రెచ్చగొడుతున్న చైనా'

భారత్​-చైనా సరిహద్దు ఘర్షణలపై స్పందించింది అమెరికా మీడియా. సరిహద్దు వెంట ఉద్రిక్తతలు పెంచుతూ భారత జాతీయవాద పులిని చైనా రెచ్చగొడుతోందని విశ్లేషించింది. వాస్తవాధీన రేఖ వెంట దక్షిణ చైనా సముద్రంలో అనుసరించిన వ్యూహాన్నే భారత్​ లక్ష్యంగా అమలు చేస్తోందని పేర్కొంది.

'భారత్​, చైనాల మధ్య మధ్యవర్తిత్వం ఆలోచన లేదు'

భారత్​, చైనాల మధ్య సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారం దిశగా మధ్యవర్తిత్వం వహించే ఆలోచన లేదని స్పష్టం చేసింది అమెరికా. లద్దాక్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. వీర మరణం పొందిన భారత జవాన్లకు సంతాపం ప్రకటించింది శ్వేతసౌధం.

'హాంకాంగ్​ విషయంలో చైనా పునరాలోచించుకోవాలి'

హాంకాంగ్​పై జాతీయ భద్రతా చట్టాన్ని విధించాలన్న చైనా నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశాయి జీ-7 సభ్య దేశాలు. ఈ నిర్ణయంపై చైనా పునరాలోచించుకోవాలంటూ అన్ని దేశాలు సంయుక్తంగా ప్రకటనను విడుదల చేశాయి.

సెలవిక: బరువెక్కిన జన హృదయం.. అడుగడుగునా పూలవర్షం

దేశ రక్షణ కోసం శత్రుమూకలతో పోరాడి వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబుకి యావత్‌ భారతావని అశ్రునయనాల అంతిమ వీడ్కోలు పలికింది. సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో... అమరజవాను అంత్యక్రియలు నిర్వహించారు. ఉద్విగ్నభరితంగా సాగిన అంతిమయాత్రలో బరువెక్కిన గుండెలతో దారిపొడవునా నిల్చున్న స్థానికులు... కల్నల్‌ సంతోష్‌బాబు పార్థీవదేహంపై పూలవర్షం కురిపించారు.

ప్రతీ గుండె ధైర్యమై... నరనరానా ప్రవహించే దేశభక్తివై...

నీ త్యాగం వృథా కాదు... నీ తెగింపు మరిచేది కాదు... దేశం యావత్తు నీ మరణం అజరామరం అని గొంతెత్తుతోంది... వింటున్నావా సంతోషన్నా. నీవు భౌతికంగా మాకు దూరమైనా... సరిహద్దులో ఎగిరే జాతీయ జెండా రెపరెపల్లో... భారత్​మాతాకీ జై అన్న నినాదంలో ఎప్పటికీ బతికే ఉంటావు సైనికా...

Last Updated : Jun 18, 2020, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.