ETV Bharat / city

లక్ష్యం దిశగా కొవాగ్జిన్... 13వేల మందిపై ప్రయోగం - covaxin vaccine trails by bharat biotech

భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్​ కొనసాగుతున్నాయి. నవంబర్ నెల మొదటి వారంలో ప్రారంభమైన ఈ ట్రయల్స్​లో ఇప్పటి వరకు 13 వేల మందిపై కొవాగ్జిన్ టీకాను ప్రయోగించారు. మరో 13వేల మందిపై ప్రయోగించనున్నారు.

Covid 19 vaccine phase-3 trials cross half-way mark of 13,000 volunteers
దేశంలోనే అతి పెద్ద మూడో దశ ట్రయల్స్
author img

By

Published : Dec 22, 2020, 1:04 PM IST

భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్​ కొనసాగుతున్నాయి. దేశంలోని 26వేల మంది వాలంటీర్లపై టీకాను ప్రయోగించ తలపెట్టిన బయోటెక్ ఇప్పటి వరకు 13 వేల మందిపై ప్రయోగాలు చేసింది. తొలి, రెండో దశలో వెయ్యి మందికిపైగా ట్రయల్స్‌ జరగ్గా.. ఈ సారి పెద్ద మొత్తంలో 26వేల మందిపై ప్రయోగాలు చేపడుతోంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహకారంతో భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ను పరీక్షిస్తోంది. నిర్వీర్యం చేసిన కొవిడ్‌ వైరస్‌ నుంచి ఈ వ్యాక్సిన్‌ తయారు చేసింది. దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం మూడో విడత ట్రయల్స్‌లో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థగా భారత్‌ బయోటెక్‌ సంస్థ నిలిచింది.

వాలంటీర్లకు కృతజ్ఞతలు

ఇది భారతదేశంలో ఇప్పటివరకు జరగని అపూర్వమైన వ్యాక్సిన్ ట్రయల్. కరోనా కోసం సురక్షితమైన, సమర్థవంతమైన భారతీయ వ్యాక్సిన్‌ను తీసుకురావడానికి మాకు సహకరించిన 13,000 మంది వాలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. 26వేల మందిపై ఈ వ్యాక్సిన్​ను ప్రయోగించాలన్న లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటాం.

- సుచిత్ర ఎల్లా, భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ

140కు పైగా గ్లోబల్ పేటెంట్స్

భారత్ బయోటెక్ 140 కంటే ఎక్కువ గ్లోబల్ పేటెంట్లతో, 16కు పైగా వ్యాక్సిన్ల విస్తృత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో, 4 బయో థెరప్యూటిక్స్, 116 కంటే ఎక్కువ దేశాలలో రిజిస్ట్రేషన్లు, డబ్ల్యూహెచ్‌ఓ ప్రీ-క్వాలిఫికేషన్‌లతో అద్భుతమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. గ్లోబల్ బయోటెక్ పరిశ్రమకు కేంద్రంగా ఉన్న జీనోమ్ వ్యాలీలో ఉన్న ఈ సంస్థ.. ప్రపంచ స్థాయి వ్యాక్సిన్ & బయో థెరప్యూటిక్స్, రీసెర్చ్ & ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, బయో-సేఫ్టీ లెవల్ 3 తయారీ, టీకా సరఫరా, పంపిణీలు చేస్తోంది.

4 బిలియన్లకు పైగా వ్యాక్సిన్లు

ప్రపంచవ్యాప్తంగా 4 బిలియన్లకు పైగా వ్యాక్సిన్లను పంపిణీ చేసిన భారత్ బయోటెక్ తన ఆవిష్కరణలను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ఇన్​ఫ్ల్యూయెంజా హెచ్ 1 ఎన్ 1, రొటావైరస్, జపనీస్ ఎన్సెఫాలిటిస్, రేబిస్, చికన్‌గున్యా, జీకా , టైఫాయిడ్ కోసం ప్రపంచంలోని మొట్టమొదటి టెటానస్-టాక్సైడ్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసింది.

75 రకాల టీకాలు

వివిధ ప్రాంతాల్లో క్లినికల్ ట్రయల్స్​ నిర్వహించడంలో ఈ సంస్థ ప్రావీణ్యం కలిగి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 75 రకాల టీకాలను 7 లక్షల మందిపై ప్రయోగించింది. ప్రపంచ సామాజిక ఆవిష్కరణ కార్యక్రమాలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాల్లో బయోటెక్ సంస్థ నిబద్ధత.. పోలియో, రొటా వైరస్, టైఫాయిడ్ ఇన్​ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు బయోపోలియో, రొటావ్యాక్, టైఫర్ టీసీవీ వ్యాక్సిన్​లను తయారు చేయడానికి ఉపయోగపడింది. ఎన్​ఐవీ, ఐసీఎంఆర్​లతో కలిసి జపనీస్​ ఎన్సెఫాలిటిస్​ వ్యాక్సిన్ (జెనావ్యాక్)ను రూపొందించింది.

ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 617 కరోనా కేసులు, 3 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.