ETV Bharat / city

‘కొవాగ్జిన్‌’ బూస్టర్‌తో రోగనిరోధక శక్తి.. భారత్‌ బయోటెక్‌ స్పష్టీకరణ - కోవాగ్జిన్ టీకాతో సత్ఫలితాలు

Covaxin Booster Dose : కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతోందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ స్పష్టం చేసింది. ఈ టీకా.. కొవిడ్‌ అన్ని వేరియంట్లను సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపింది. ఈ విషయాన్ని ‘నేచర్‌’ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురించినట్లు పేర్కొంది. అదే సమయంలో ఎటువంటి ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’ లేవని స్పష్టం చేసింది.

Covaxin Booster Dose
Covaxin
author img

By

Published : Jul 21, 2022, 8:10 AM IST

Covaxin Booster Dose: ‘కొవాగ్జిన్‌’ టీకా బూస్టర్‌ డోసుతో రోగ నిరోధక శక్తి పెరుగుతోందని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. ఈ విషయాన్ని ‘నేచర్‌’ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌లో ప్రచురించినట్లు పేర్కొంది. కొవాగ్జిన్‌ టీకా బూస్టర్‌ డోసు ప్రయోగాలను 184 మంది వాలంటీర్లపై నిర్వహించారు. రెండు డోసుల టీకా తీసుకున్న ఆరు నెలల తర్వాత వారికి బూస్టర్‌ డోసు ఇచ్చారు. ఇందులో సగం మందికి నిజమైన టీకా, మిగిలిన వారికి ‘ప్లాసిబో’ ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. బైండింగ్‌ యాంటీబాడీస్‌ ఉత్పత్తి, ఆర్‌బీడీ, ఎన్‌-ప్రొటీన్‌, మెమొరీ టీ-సెల్‌, బీ-సెల్‌ రెస్పాన్స్‌.. తదితర అంశాలను పరిశీలించారు.

కొవిడ్‌ వైరస్‌- ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్‌, ఒమిక్రాన్‌ వేరియంట్లను ఈ టీకా సమర్థంగా ఎదుర్కొన్నట్లు తేలింది. టీకా తీసుకున్న కొంతకాలానికి యాంటీబాడీల సంఖ్య తగ్గినప్పటికీ, టీ-సెల్‌ రెస్పాన్స్‌ మాత్రం 12 నెలల పాటు కనిపించినట్లు భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. దీనివల్ల దీర్ఘకాలం పాటు బి-సెల్‌ మెమొరీ కూడా సాధ్యపడుతోందని వివరించింది. తొలి రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో ఆరు నెలల తర్వాత రోగ నిరోధక శక్తి తగ్గుతోందని.. కానీ, బూస్టర్‌ డోసు తీసుకుంటే అనూహ్యంగా పెరుగుతోందని వెల్లడించింది. అదే సమయంలో ఎటువంటి ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’ లేవని స్పష్టం చేసింది.

సురక్షిత సార్వత్రిక టీకా.. ఈ ప్రయోగాలతో కొవాగ్జిన్‌ టీకా.. స్పైక్‌, ఆర్‌బీడీ, ఎన్‌- ప్రొటీన్‌లకు వ్యతిరేకంగా యాంటీ బాడీలతో కూడిన సమర్థమైనదిగా నిర్ధారణ అవుతోందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. దీర్ఘకాలంపాటు వైరస్‌ నుంచి రక్షణ లభిస్తోందన్నారు. ఒకే రకమైన డోసును పిల్లలు, పెద్దల్లో వేసేందుకు అనువైన టీకా కావడం, ప్రైమరీ- బూస్టర్‌ డోసుగా వినియోగించే అవకాశం ఉండటంతో ఇది ‘సార్వత్రిక టీకా’గా రూపుదిద్దకున్నట్లు వివరించారు. ఎన్నో దశాబ్దాలుగా చిన్న పిల్లల కోసం పలు రకాల టీకాలు ఉత్పత్తి చేసేందుకు వినియోగించిన, ఎంతో భద్రమైనదిగా నిర్ధారణ అయిన ‘హోల్‌ వైరాన్‌ ఇన్‌-యాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌ ప్లాట్‌ఫామ్‌’ను వినియోగించి కొవాగ్జిన్‌ టీకాను ఆవిష్కరించినట్లు గుర్తుచేశారు. భారత్‌ బయోటెక్‌ వద్ద ప్రస్తుతం 5 కోట్ల డోసుల టీకా పంపిణీకి సిద్ధంగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.