కొవిడ్ మార్గదర్శకాలను అనుగుణంగా భక్తులంతా వినాయక నిమజ్జనాలు చేసుకోవాలని భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి విజ్ఞప్తి చేసింది. ప్రసాద వితరణ లేకుండా నిరాడంబరంగా గణపతి విగ్రహాలు నిమజ్జనాలకు రావాలని కోరారు. జంటనగరాల పరిధిలో సామూహిక నిమజ్జనాలను రద్దు చేసినట్లు ఇదివరకే ప్రకటించిన ఉత్సవ సమితి... ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరింది. గణేశ్ ఉత్సవ సమితి ఆదేశాలకు అనుగుణంగా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి విన్నివించారు.
భాగ్యనగరంలో 1980 నుంచి సామూహిక వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయని తెలిపారు. కరోనా ప్రభావంతో సామూహిక నిమజ్జనాలను రద్దు చేసినట్లు తెలిపారు.
ఇవీచూడండి: గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై సీపీ అంజనీకుమార్ సమీక్ష