నౌహీరా షేక్‌కు ముంబయిలో బినామీలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ వైద్యురాలు, వ్యాపారి.. బినామీగా ఉన్నట్లు సీసీఎస్ దర్యాప్తులో తేలింది. హీరా గోల్డ్ కంపెనీ నుంచి వీరిద్దరి ఖాతాలకు రూ.450 కోట్లు మళ్లించారు. ఇవాళ నాంపల్లి కోర్టులో సీసీఎస్... 3 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలు చేసింది.
ఇప్పటివరకు నౌహీరా షేక్‌కు చెందిన 124 ఆస్తులు గుర్తించారు. వీటిలో 84 ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని పోలీసులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆస్తుల విలువ రూ.1,200 కోట్లుగా తేల్చారు. 256 బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. విదేశాల్లో ఆస్తులపై ఈడీతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.