తెలంగాణ వ్యాప్తంగా చలి వణికిస్తోంది. రాబోయే రెండు రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఒకటి రెండు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
ఉదయం సమయంలో తేలికపాటి పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో శీతల గాలుల పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈశాన్య తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి:'అన్నదాతల ఆవేదనను కేంద్రం వినాల్సిందే'