రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిత్యం వందల సంఖ్యలో ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితుల కోసం.. సరిపడా బెడ్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
కోఠి ఈఎన్టీ, గాంధీ ఆస్పత్రులతో పాటు.. సరోజినీ దేవి ఐ ఆస్పత్రిలోనూ 200 పడకలను బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం కేటాయించింది. వ్యక్తిగత, పరిశుభ్రత పరిసరాలతో బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండొచ్చని ఆస్పత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ మోదిని తెలిపారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు, సౌకర్యాలు, కంటిపై మ్యూకోర్ మైకోసిస్ ప్రభావానికి సంబంధించి ఆమెతో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి...