ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని జీడితోటలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఉద్దానంలో జీడి, కొబ్బరి తోటల పరిసరాల్లో నిత్యం ఎలుగుబంట్లు సంచరిస్తుండటం షరా మాములై పోయింది. అయితే అనకాపల్లి, ఒంకులూరు గ్రామాల మధ్య తోటల్లో పొడవైన పనస చెట్టు ఎక్కింది. చెట్టుపై ఉన్న కాయలను అందుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. దాన్ని తిలకించేందుకు కొంతమంది అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ ఎలుగుబంటి చెట్టు దిగి మెల్లగా అక్కనుంచి జారుకుంది.
ఎలుగు బంటి పనస చెట్టు ఎక్కి ఏం చేసిందో తెలుసా?
ఏపీలో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో జీడితోటలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. పొడవైన పనస చెట్టు ఎక్కి అందరినీ ఆశ్చర్యాన్నికి గురిచేసింది.
ఎలుగు బంటి పనస చెట్టు ఎక్కి ఏం చేసిందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని జీడితోటలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఉద్దానంలో జీడి, కొబ్బరి తోటల పరిసరాల్లో నిత్యం ఎలుగుబంట్లు సంచరిస్తుండటం షరా మాములై పోయింది. అయితే అనకాపల్లి, ఒంకులూరు గ్రామాల మధ్య తోటల్లో పొడవైన పనస చెట్టు ఎక్కింది. చెట్టుపై ఉన్న కాయలను అందుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. దాన్ని తిలకించేందుకు కొంతమంది అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ ఎలుగుబంటి చెట్టు దిగి మెల్లగా అక్కనుంచి జారుకుంది.
ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్
Last Updated : Jul 1, 2020, 10:44 AM IST