ETV Bharat / city

స్థానిక సంస్థల ఎన్నికలే దేశ పరిపాలనకు పునాది: దత్తాత్రేయ

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్పొరేటర్ల సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హిమచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తదితరులు హాజరయ్యారు.

bc Welfare Society has set up a meeting of honor for new corporators at Ravindra Bharati
స్థానిక సంస్థల ఎన్నికలే దేశ పరిపాలనకు పునాది: దత్తాత్రేయ
author img

By

Published : Dec 29, 2020, 5:37 PM IST

Updated : Dec 29, 2020, 5:59 PM IST

స్థానిక సంస్థల ఎన్నికలే దేశ పరిపాలనకు పునాది అని హిమచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. స్థానిక సంస్థలు ఎంత దృఢంగా ఉంటే రాష్ట్రం అంత దృఢంగా ఉంటుందన్నారు. మహిళలు సాధికారత సాధించినప్పుడే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్పొరేటర్ల సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హిమచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే, ఎంపీగా గెలవడం కంటే కార్పొరేటర్‌గా ఎన్నిక కావడం చాలా కష్టమని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. చట్ట సభలో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించి.. బీసీ శాఖను ఏర్పాటు చేసినప్పుడే ఈ వర్గాలకు నిజమైన న్యాయం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

రాజకీయాలకు అతీతంగా వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అందరు కృషి చేయాలని ఎంఐఎం అధినేత అసదుద్దిన్‌ ఓవైసీ అన్నారు. సమష్టి కృషితో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు.

కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా... బీసీలకు అన్యాయం చేస్తుందని ఆర్‌.కృష్ణయ్య ఆరోపించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన పోరాటం చివరి పోరాటం కాదని.. ఆత్మగౌరవ పోరాటమని ఆయన అభివర్ణించారు. బీసీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. బీసీల పట్ల కనిపించని వివక్ష చూపుతున్నారన్నారు.

ఇదీ చూడండి: కరోనా కొత్త స్ట్రెయిన్‌పై మంత్రి ఈటల సమీక్ష

Last Updated : Dec 29, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.