ETV Bharat / city

GANGULA: 'త్వరగా ఉద్యోగాలు భర్తీ చేయాలనే సంకల్పంతో సీఎం'

బీసీ సంక్షేమ శాఖలో ఖాళీల గుర్తింపుపై ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్​ సమీక్ష నిర్వహించారు. జోన్ల విభ‌జ‌న పూర్తితో ఉద్యోగాల భ‌ర్తీ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నార‌ని మంత్రి వెల్లడించారు. ఉద్యోగ ఖాళీల పూర్తి స‌మాచారాన్ని త్వరలోనే ముఖ్యమంత్రికి అందిస్తామని మంత్రి చెప్పారు.

GANGULA: 'త్వరగా ఉద్యోగాలు భర్తీ చేయాలనే సంకల్పంతో సీఎం'
GANGULA: 'త్వరగా ఉద్యోగాలు భర్తీ చేయాలనే సంకల్పంతో సీఎం'
author img

By

Published : Jul 16, 2021, 3:40 PM IST

జోన్ల విభ‌జ‌న పూర్తితో ఉద్యోగాల భ‌ర్తీ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నార‌ని, అన్ని స్థాయిల్లోని ఖాళీల‌ను పూర్తిగా గుర్తించి భ‌ర్తీ చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ అధికారుల‌ను ఆదేశించారు. తమ శాఖలో ఖాళీల గుర్తింపుపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంక‌టేశం, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో గంగుల సమావేశమయ్యారు. బీసీ సంక్షేమ శాఖ ప‌రిధిలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీల గురించి వివరించిన బుర్రా... గురుకులాల్ని మ‌రింత ఉన్న‌తంగా తీర్చిదిద్దేలా ప్ర‌తీ ఖాళీని భర్తీ చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాలల స్థాయి పెంపు, 119 నూతన స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నందున వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని నివేదిక తయారు చేస్తున్నట్లు వివరించారు.

బీసీ కార్పొరేష‌న్లు, సమాఖ్యలను బలోపేతం చేసేలా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. వివిధ శాఖ‌ల్లో ప‌నిచేస్తున్న ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల‌తో పాటు శాఖ‌కు కేటాయించిన పోస్టులు, ఖాళీల‌పై స‌మ‌గ్రంగా చ‌ర్చించారు. శాఖలోని ప్ర‌తి ఖాళీని భ‌ర్తీ చేసి ఇటు నిరుద్యోగుల‌కు, అటు శాఖ‌లో పూర్తి స్టాఫ్​తో ప‌నులు ఇబ్బంది లేకుండా జ‌రిగేలా చూసుకోవాల‌ని మంత్రి గంగుల సూచించారు. ఉద్యోగ ఖాళీల పూర్తి స‌మాచారాన్ని త్వరలోనే ముఖ్యమంత్రికి అందిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: Trs Parliamentary Meeting: ప్రగతిభవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.