రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని బీసీ సంక్షేమ సంగం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అంబర్పేట్లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఓటర్లుగానే చూస్తున్నారని.. అధికారంలోకి వచ్చి.. బీసీల సంక్షేమాన్ని పట్టించుకోరా అని ప్రశ్నించారు.
పక్క రాష్ట్రం సీఎం జగన్ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి రియంబర్స్మెంట్ ఇస్తుంటే.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ప్రైవేటు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు లేకుండా చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. నిరుద్యోగులు ఉపాధి లేక రోడ్ల మీద తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాంకుతో సంబంధం లేకుండా ప్రతి బీసీ విద్యార్థికి సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో రిజర్వేషన్లు అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: నువ్వు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా: మంత్రి హరీశ్