బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో దసరా వేడుకలు సందడిగా సాగాయి. తెలుగు నాట్య కళా మండలి ఆధ్యర్యంలో తెలుగువారు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దుర్గామాతను ఘనంగా అలంకరించి మహిళలు పూజలు చేశారు. సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై తెలుగు ఖ్యాతిని చాటారు.
తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు, యువతులు బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలకు కాలు కదుపుతూ నృత్యాలు చేశారు. కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. చిన్నారుల కోసం పలు వినోదాత్మక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం అందరూ తమ తమ కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనాలు చేశారు. అన్ని తెలుగు పండుగలను అందరూ కలిసి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని బ్రస్సెల్స్లోని తెలుగువారు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో వినాయక చవితి వేడుకలు కూడా ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఇదీ చదవండి: Electronic sales in festive season: ఎలక్ట్రానిక్ ఉపకరణాల జోరు.. రెండింతలు పెరిగిన అమ్మకాలు