ఆస్ట్రేలియాలోని అడిలైట్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. కొవిడ్ మహమ్మారి సమయంలో బతుకమ్మ వేడుకలను ప్రపంచంలోనే తొలిసారిగా తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు అడిలైడ్ తెలంగాణ అసోసియేషన్ తెలిపింది. 300 మందికి పైగా మహిళలు, చిన్నారులు ఉత్సహంగా బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు.
అందంగా బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. కొంతమంది స్థానిక ఆస్ట్రేలియా వాసులు కూడా బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అడిలైడ్‌లోని ఎల్డర్ పార్క్‌లో వైభవంగా వేడుకలను నిర్వహించి టోరెన్స్ నదిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఇవీ చూడండి: తిరుమలలో మోహినీ అవతారంలో వేంకటేశ్వరుడు