భాజపా మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతి తమ ఫ్లాట్‌లో అద్దెకున్న వారిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఫ్లాట్‌ని ఖాళీ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బంగారు శృతికి చెందిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ నగర్ కాలనీలో ఉన్న ఫ్లాట్‌ని అద్దెకి ఇచ్చారు . ఈ నెల 22న షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఫ్లాట్‌లో ఉన్న ఫర్నిచర్ దగ్ధమై.. ఫ్లాట్ మొత్తం కాలిపోవడంతో ఖాళీ చేస్తున్నారు. సమాచారం లేకుండా వెళ్లిపోతున్నారని ఆమె పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: 'ధరణి'లో స్లాట్ బుకింగ్ ఎలా చేయాలో... తెలుసుకుందాం