ETV Bharat / city

APNGO: 'అవును.. మాకు ఫోన్​ చేసింది సజ్జలే.. కానీ అలామాత్రం బెదిరించలేదు' - ap latest news

రెండు రోజల కిందట ప్రెస్‌మీట్‌లో ఉండగా.. తనను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌లో బెదిరించినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టతనిచ్చారు. ఈ విషయంలో తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.

APNGO
APNGO
author img

By

Published : Oct 9, 2021, 12:43 PM IST

APNGO: 'అవును మాకు ఫోన్​ చేసింది సజ్జలే.. అలా బెదిరించలేదు..'

రెండు రోజలు కిందట ప్రెస్‌మీట్‌లో ఉండగా తనను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్‌లో బెదిరించినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టతనిచ్చారు. ఉద్యోగుల డిమాండ్లన్నీ విన్నవించుకునేందుకు సచివాలయంలో తమకు అందుబాటులో ఉంటే వ్యక్తి సజ్జల అన్న ఆయన.. అవాస్తవ వార్తల ద్వారా తమ బంధాన్ని చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు.

కలిసికట్టుగా పోరాడుతున్నందుకు సజ్జల శుభాకాంక్షలు తెలిపినట్లు వెల్లడించారు. ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ అని సజ్జల అన్నట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాలన్నీ తమ కంట్రోల్‌లోనే ఉన్నాయని సజ్జలకు చెప్పినట్లు వివరించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ఘర్షణ ధోరణి ఉండొద్దని సజ్జల చెప్పినట్లు పేర్కొన్నారు. తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఏ రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరించబోమని బండి శ్రీనివాసరావు తెలిపారు.

ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభు‌త్వమని సజ్జల అన్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వంతో ఘర్షణ ధోరణి ఉండొద్దని సజ్జల సూచించారు. సజ్జల మమ్మల్ని బెదిరించినట్లు దుష్ప్రచారం చేశారు. మాపై కొంతమంది సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు రావాల్సిన రాయితీల విషయంలో పోరాటం చేస్తాం. ఏ రాజకీయ పార్టీకి తొత్తులుగా వ్యవహరించేది లేదు.

- బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు

ఇవీ చూడండి:

Lakhimpur Incident: కేంద్ర మంత్రి డ్రైవర్​ కుటుంబానికి రూ.45లక్షలు

Navjot Singh Sidhu News: లఖింపుర్ ఖేరిలో సిద్ధూ నిరాహార దీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.