ETV Bharat / city

20వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి: బండి సంజయ్‌ - 20వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి

Bandi Sanjay on School Fees: ప్రైవేట్, మైనార్టీ విద్యాసంస్థల్లో ఫీజుల పెంపును నియంత్రించి... ఫీజుల నియంత్రణ చట్టాన్ని వెంటనే తీసుకు రావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు నాలుగు జతల పాఠశాల ఏకరూప దుస్తులు ఇవ్వాలని సంజయ్‌ తెలిపారు. ఖాళీగా ఉన్న 20వేల టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.

Bandi Sanjay on School Fees
Bandi Sanjay on School Fees
author img

By

Published : Jun 11, 2022, 8:58 PM IST

Bandi Sanjay on School Fees: కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణలో ఈ ఎనిమిదేళ్లలో విద్యా వ్యవస్థను తెరాస ప్రభుత్వం పట్టించుకోలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు.‘‘ఉపాధ్యాయులకు జీతాలు సకాలంలో వస్తాయో రావో తెలియని పరిస్థితి. మ్యూచువల్‌ బదిలీలు చేస్తారో లేదో. గతంలో ఉపాధ్యాయులు ఎన్నడూ ఇంత మానసిక క్షోభ అనుభవించిన దాఖలాలు లేవు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వమే 75శాతం నిధులు కేటాయిస్తోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,497 కోట్లలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వాటా రూ.2,700 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఇన్ని కోట్లు కేటాయించినా సోకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే’’ అని విమర్శించారు.

‘‘ప్రైవేట్‌ స్కూళ్లలో, మైనార్టీ విద్యాసంస్థల్లో ఫీజుల పెంపును నియంత్రించాలి. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై ప్రత్యేక చట్టం తీసుకొస్తామని ఈ ఏడాది జనవరిలో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. దీనిపై ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ సిఫార్సులను రాష్ట్రప్రభుత్వం ఆమోదించిందా? లేదా? ఫీజుల నియంత్రణ చట్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు 20 నుంచి 40శాతం ఫీజులు పెంచి పేదల ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. పేద విద్యార్థులకు నాలుగు జతల యూనిఫామ్‌ ఇవ్వాలి. 20వేల ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి’’ అని బండి సంజయ్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.