రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొవిడ్ మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని పలువురు రాజకీయ ప్రముఖులు కోరుకున్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా భగవంతుడు ఆయణ్ని ఆశీర్వదించాలని వేడుకున్నట్లు చెప్పారు.
మరోవైపు కేసీఆర్ త్వరగా ఆరోగ్యంతో తిరిగిరావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు.
మరోవైపు సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు కోరుకున్నారు. కేసీఆర్ పేరు మీద అర్చనలు చేయాలని పూజారులను కోరారు.
హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీలత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తార్నాకలోని లక్ష్మీగణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు.
ఈనెల 19న సీఎం కేసీఆర్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నందున.. హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎంకు వైద్యులు సూచించారని చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ తన ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
- ఇదీ చదవండి : సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్