సంచలనం సృష్టించిన.. హీరా గోల్డ్ కేసులో నౌహీరా షేక్‌కు బెయిల్ మంజూరైంది. ముంబయి జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. హీరా గోల్డ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నౌహీరా షేక్... రెండున్నర ఏళ్లుగా జైలులోనే ఉన్నారు. నౌహీరాకు 6 వారాల తాత్కాలిక బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది.
బాధితులకు చెల్లించాల్సిన సొమ్ము సమకూర్చాలని నౌహీరాను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే నౌహీరా వద్ద వేలాది మంది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. వారంతా తమకు రావాల్సిన నగదు కోసం ఎదురుచూస్తున్నారు.