Mega medical camp: బద్రివిశాల్ పన్నాలాల్ పిట్టీ ట్రస్టు - అగర్వాల్ సేవా దళ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంప్‌కి విశేష స్పందన లభించింది. ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో ప్రకాశం విద్యానికేతన్ హై స్కూల్ ప్రాగణంలో ఈ మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని పిట్టీ ట్రస్టు సభ్యుడు ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు వివిధ ఆరోగ్య పరీక్షలను చేయించుకున్నారు.
సంవత్సరానికి 15 సార్లు...
Medical camp: హై-టెక్ సిటీ మెడికోవర్ ఆసుపత్రి సహకారంతో... ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు పిట్టీ ట్రస్టు, అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఇది 96వ ఉచిత వైద్య శిబిరమని అన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సంవత్సరానికి 15సార్లు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కొవిడ్ సమయంలోనూ సేవలు...
ట్రస్టు ద్వారా కేవలం పుస్తకాల పంపిణీ మాత్రమే కాకుండా... రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సంవత్సరానికి ఐదు వేల నోట్ పుస్తకాలు, ఉపకార వేతనాలు, 50మందికి వితంతు పెన్షన్లు, విద్య, ఆరోగ్య, వృద్ధాశ్రమాల నిర్వహణ వంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కొవిడ్ సమయంలో ఐదు వేల మందికి వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:Run for Girl Child: ఉత్సాహంగా సాగిన రన్ ఫర్ గర్ల్ చైల్డ్ కార్యక్రమం